అర్ధరాత్రి ఎంపీ కారు హల్ చల్... బానెట్ పై ఓ వ్యక్తిని వేళాడదీసి..

అర్ధరాత్రి ఎంపీ కారు హల్ చల్... బానెట్ పై ఓ వ్యక్తిని వేళాడదీసి..

ఓ ఎంపీ కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు ఓ వ్యక్తిని ఢీకోట్టి కారు బానెట్ పై ఎక్కించుకుని 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 11గంటలకు జరిగింది. బీహార్ కు చెందిన ఎంపీ చందన్ సింగ్ కు చెందిన కారుగా గుర్తించారు. ఘటన జరిగినప్పుడు కారులో ఎంపీ లేరని తెలిపారు. ఆదివారం రాత్రి 11గంటలకు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చేతన్ అనే వ్యక్తి వెహికిల్ ను పలుమార్లు రాసుకుంటూ వెళ్లాడు. అందుకు ఆగ్రహించిన చేతన్ కారుకంటే ముందుకు వెళ్లి తన వెహికిల్ ను ఆపి ఎంపీ కారును ఆపాలనే ఉద్దేశంతో రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడు. కారును ఆపాలని డ్రైవర్ ను కోరగా అతను వినిపించుకోకుండా అలాగే పోనిచ్చాడు. దీంతో చేతన్ కారు బానెట్ పై వేళాడాడు. అలా వేళాడుతూ ఉండగా కారును పోలీసులు చూశారు. వెంటనే కారును పోలీసులు వెంబడించారు. కారు ఆపాలన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రైవర్ పట్టించుకోలేదు. ఎట్టకేలకు కారుముందుకు వెళ్లిన పోలీసు వాహనం ఎంపీ వెహికిల్ ను ఆపింది. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. నిందితుడు కారు నడుపుతున్నప్పుడు మద్యం తాగి ఉన్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story