థాయ్ పోలీసులకు చిక్కిన గ్యాంబ్లర్ చీకోటి ప్రవీణ్

హైదరాబాద్‌కు చెందిన గ్యాంబ్లర్ చీకోటి ప్రవీణ్ థాయ్ పోలీసులకు చిక్కాడు. థాయ్‌ల్యాండ్ పోలీసులు అతి పెద్ద గ్యాంబ్లింగ్ రాకెట్‌ను ఛేదించారు. పటాయాలోని ఆసియా హోటల్‌లో నిన్న రాత్రి నిర్వహించిన దాడుల్లో... గ్యాంబ్లింగ్ ఆడుతున్న 97 మంది పోలీసులు పట్టుబడ్డారు. వీరిలో 80 మంది భారతీయులే అని పోలీసులు వెల్లడించారు. ఇందులో గ్యాంబ్లర్ చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. వీరిందరూ కేవలం గ్యాంబ్లింగ్ కోసమే థాయ్‌కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్యాసినోలో దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అరెస్ట్ అయినవారి నుంచి 92 మొబైల్ ఫోన్లు, మూడు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిలో సిత్రానన్ కెవ్లార్ ఉన్నారు. ఈమె భర్త క్యాసినోకు విదేశాల నుంచి టూరిస్ట్‌లను రప్పించినట్లు తెలుస్తోంది. గత నెల 27న థాయ్‌ల్యాండ్‌కు వచ్చిన భారతీయులు నిజానికి ఇవాళ తిరిగి వెళ్ళాల్సి ఉంది. ఈలోగా రాత్రి చేసిన దాడిలో వీరు దొరికిపోయారు. గ్యాంబ్లింగ్ కోసం తమ దేశానికి వచ్చినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
భారత గ్యాంబ్లర్లు బ్లాక్‌జాక్‌తో పాటు బకారత్ గేమ్‌ను ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 92 మొబైల్ ఫోన్లు, 20 కోట్ల విలువైన చిప్స్, మూడు ట్యాబ్‌లతోపాటు లక్షా 60 వేల రూపాయల భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్యాంబ్లింగ్ రూమ్ కోసం రోజుకు రెండున్నర లక్షలు వసూలు చేశారు... సహాయకులు అందరూ భారత్ నుంచే వచ్చినట్లు థాయ్ పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com