కారులో ఊపిరాడక ఎనిమిదేళ్ల బాలిక మృతి

కారులో ఊపిరాడక ఎనిమిదేళ్ల బాలిక మృతి
X
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాజులూరు మండలం కోలంకలో కారులో ఊపిరాడక ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి ప్రాణాలు కోల్పోయింది

కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాజులూరు మండలం కోలంకలో కారులో ఊపిరాడక ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి ప్రాణాలు కోల్పోయింది. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లిన బాలిక.. పక్కింటివారు రోడ్డుపై నిలిపిన కారులోకి వెళ్లి కూర్చుంది. కారు డోర్‌ లాక్‌ కావడంతో ఆ పాప బయటి రాలేకపోయింది. ఊపిరి ఆడక మృతి చెందింది. బాలిక కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చివరికి ఇంటి పక్కనున్న కారులో విగతజీవిగా కన్పించింది. బాలిక తండ్రి ఏడాది క్రితం ప్రాణాలు కోల్పోవడంతో.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. కూతురి మరణంతో తల్లి కన్నీరుమున్నారుగా విలపిస్తోంది. కారు డోర్లు లాక్ కావడం.. ఎవరూ గమనించకపోవడంతో ఘోరం జరిగింది.

Tags

Next Story