నాసిరకం ఐస్‌క్రీమ్‌ తయారీ ముఠా గుట్టురట్టు

నాసిరకం ఐస్‌క్రీమ్‌ తయారీ ముఠా గుట్టురట్టు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆమన్‌గల్‌లో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీపై SOT పోలీసుల దాడులు

నాసిరకం ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆమన్‌గల్‌లో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీపై SOT పోలీసుల దాడులు చేసి.. 10 లక్షల రూపాయల విలువచేసే నాసిరకం ఐస్‌క్రీమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్‌ సేప్టీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా.. అపరిశుభ్రమైన నీటితో ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు వాహనాలను సీజ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story