ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..వాప్‌కాస్ మాజీ సీఎండీ అరెస్ట్

వాప్‌కాస్ మాజీ సీఎండీ రాజేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌కు ఆయన సీఎండీగా పనిచేశారు. ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. ఆయన నివాసాల్లో సీబీఐ ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో 38 కోట్లకుపైగా నగదు పట్టుబడింది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో గుప్తాతో పాటు ఆయన కుమారుడు గౌరవ్ సింఘాల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2011-19 మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజిందర్ కుమార్ గుప్తాతోపాటు ఆయన భార్య రీమా సింఘాల్, తనయుడు గౌరవ్ సింఘాల్, కోడలు కోమల్ సింఘాల్‌లపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనీపత్, గాజియాబాద్‌లతోపాటు దేశవ్యాప్తంగా 19 చోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 38 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com