Viveka Murder Case : సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

Viveka Murder Case : సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

వైఎస్​ వివేకా హత్య కేసులో A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. డిఫాల్ట్ బెయిల్ పొంది ప్రస్తుతం బయట ఉన్న గంగి రెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. గంగి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. దీంతో గంగి రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడు. వివేక హత్యలో ప్రధాన పాత్ర పోషించింది గంగి రెడ్డేనని… ప్రధాన నిందితుడిగా ఉండి బయట ఉండటంతో.. సాక్షులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారని సీబీఐ తరపు లాయర్ గతంలో వాదించారు. గంగిరెడ్డి బయట ఉండటం అంత మంచిది కాదని.. హత్య చేయడమే కాదు, నేరం కప్పిపుచ్చేందుకు ఆధారాలు కూడా చేరిపేశారన్నారు. ఏపీ హైకోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. జూన్‌ 30 వరకు గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసింది. రెండు నెలల వ్యవధిలోనే గంగిరెడ్డిపై విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.

Tags

Next Story