ఫెవిక్వీక్‌తో ఓ బాలుడికి వైద్యం చేసిన డాక్టర్ అరెస్ట్

ఫెవిక్వీక్‌తో ఓ బాలుడికి వైద్యం చేసిన డాక్టర్ అరెస్ట్
X

జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ఓ ప్రైవేట్‌ వైద్యుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కనుబొమ్మపై ఫెవిక్వీక్‌తో ఓ బాలుడికి వైద్యం చేశాడు డాక్టర్‌. అయితే బాలుడు బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో చికిత్సపై డాక్టర్‌ ను నిలదీశారు బాలుడి తల్లిదండ్రులు. డాక్టర్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం తో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story