దత్తత పేరిట చిన్నారులపై దాష్టీకం

దత్తత పేరిట చిన్నారులపై దాష్టీకం
X
పసిపిల్లలపై లైంగిక వేధింపులు; డాక్టర్ జంట అరెస్ట్

దద్తత తీసుకున్న చిన్నారులను లైంగిక వేధంపులకు గురిచేసినందుకు గానూ గౌహతిలో ఓ డాక్టర్ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ వాయుల్ ఇస్లామ్, డాక్టర్ సంగీతా దత్తాను పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. మూడేళ్ళు వయసుగల కవలలను దత్తత తీసుకున్న ఆ డాక్టర్ జంట, కొన్ని నెలలుగా వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ముఖ్యంగా ఓ చిన్నారి ఆంతరంగిక అవయవాల్లో సిగరెట్లతో కాల్చినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారులను అత్యంత క్రూరంగా హింసించినట్లు పక్కా ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ఇరువురినీ మండుటెండలో కట్టేసి శిక్షించేవారని స్థానికులు సైతం నిర్ధానించారు. ఈ మేరకు డాక్టర్ జంటతో పాటూ వారి ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మీనాథ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని జుడీషియల్ కస్టడీకి తరలించారు.

Tags

Next Story