పెళ్లి పేరుతో మహిళను నిలువు దోపిడి చేశాడు

పెళ్లి పేరుతో మహిళను నిలువు దోపిడి చేశాడు
X

ఓ విమానయాన సంస్థలో పనిచేసే మహిళను మోసం చేసి ఆమె నగలను, ధనాన్ని, డెబిట్ కార్డులను ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. బెంగళూరుకు చెందిన బాధితురాలు వివాహం కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో తన ప్రొఫైల్ ను ఉంచింది. అందులోనే ఢిల్లీకి చెందిన అన్షుల్ జైన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకొవడం ప్రారంభించారు. అన్షుల్ తనను తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మూడు రోజుల క్రితం అన్షుల్ ఆమెను ఢిల్లీకి రమ్మని పిలిచాడు. తన కుటుంబానికి పరిచయం చేస్తానని నమ్మించాడు. తన తల్లిదండ్రుల ముందు గ్రాండ్ గా కనిపించేందుకు నగలను తీసుకురావాలని చెప్పాడు.

మే 7, 2023న, బాధితురాలు T-2 IGI విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్లింది. అన్షుల్ జైన్ ఆమెను తన కారులో రిసీవ్ చేసుకున్నాడు. వారు ముందుగా ఏరోసిటీ ఫుడ్ కోర్టుకు వెళ్లి స్నాక్స్ తిన్నారు. ఆపై అక్కడి నుంచి బయలుదేరి సుమారు అర కిలోమీటరు వరకు కారులో ముందుకు సాగారు, అక్కడ కారు టైర్‌లో ఏదో లోపం ఉందని, చెక్ చేయడానికి ఆమెను దిగమని అడిగాడు. ఆమె కారు దిగిన వెంటనే ఆమె విలువైన బంగారు ఆభరణాలను (14 బంగారు గాజులు, 1 జత జుమ్కా, 1 చోకర్ నెక్లెస్, 1 జత స్టడ్‌లు), శాంసంగ్ ఎస్-ఫోల్డ్ ఫోన్, బ్యాగ్, 3 ATM కార్డ్‌లు, ₹ 15,000 నగదు, ఆమె ఇంటి కీ తో పాటు ఆమె ఎయిర్‌లైన్ ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ కార్డ్ (AEP)ని కూడా దొంగిలించాడు. ఆ తర్వాత, కెనరా బ్యాంక్ నుంచి నాలుగు లావాదేవీలలో రూ.40,000, ICICI బ్యాంక్ నుండి సుమారు ₹ 18,000 డ్రా చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో తాను ఓ ఎయిర్‌లైన్‌లో క్యాబిన్ క్రూ అని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు IGI ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్‌లు 420/406 కింద FIR నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story