హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
X

హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లోని కేఎస్‌ఆర్ క్లాసిక్‌ అపార్ట్ మెంట్‌లో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు, బాచుపల్లి పోలీసులు రైడ్ చేసి క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. పట్టబడ్డ నిందితులను గణేష్ కుమార్, శ్రీనివాస్ రావు, రాంబాబుగా గుర్తించారు. ప్రధాన బుకీలు గణేష్, పాండు, రాజేష్ పరారీలో ఉన్నట్లు కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్‌ టాప్‌లతో పాటు 7 సెల్‌ ఫోన్లు ఓ బైక్‌, 20.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల ఖాతాలో ఉన్న 2.2లక్షల నగదును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. బెట్టింగ్‌ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Next Story