గోల్డ్ వర్క్ షాప్ లో దొంగతనం.. కిలో 700గ్రాముల బంగారం చోరీ

గోల్డ్ వర్క్ షాప్ లో దొంగతనం.. కిలో 700గ్రాముల బంగారం చోరీ

సికింద్రాబాద్ లోని బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ షాప్ లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఐటీ అధికారుల పేరిట కొందరు దుండగులు షాప్ లోకి చొరపడ్డారు. ఐటీ అధికారులమని రైడ్ చేస్తున్నట్లు వర్కర్ లను బెధిరించారు. వారి దగ్గర నుంచి కిలో 7౦౦ గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ ఘటన సికింద్రాబాద్ లోని సిద్ధి వినాయక జువెలర్స్ లో జరిగింది.

ఐటీ అధికారుల పేరుతో కోటి రూపాయల విలువైన బంగారు ఆభరాన్ని దోచుకెళ్లారు. 6 మంది షాపులోకి వచ్చి ఐటి అధికారులమని చెప్పారు. బంగారం దుకాణాల్లో సోదా చేసి సుమారు 17 వందల గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకువెళ్లారు. నలుగురు ముఖానికి మాస్కులు ధరించగా ఇద్దరు జూలరీ షాప్ యజమానులతో సంప్రదింపులు జరిపారు. షాపు నిర్వాహకుల ఫోన్లను తీసుకొని ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ బంగారంతో ఊడయించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది గంట తర్వాత అప్రమత్తమైన బంగారం వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షాపులో పనిచేసే వారితో పాటు పలువురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఏసీపి రమేష్ తెలిపారు

Tags

Next Story