వివేకా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

వివేకా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వివేకా కూతురు సునీతారెడ్డి. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తీసుకోవడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మెరిట్ ప్రకారం లేవని అన్నారు. హత్య కేసు దర్యాప్తుపై గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు సునీత. అంతేకాదు.... అవినాష్ రెడ్డి.. ఏపీ సీఎం సంరక్షణలో ఉన్నారని సుప్రీం కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఎదుట సునీతారెడ్డి న్యాయవాదులు ప్రస్తావించగా.... దీనిపై ఇవాళ విచారణ చేపడతామని పేర్కొంది ధర్మాసనం.
మరోవైపు.. అవినాష్ 25 వరకు ప్రతి రోజూ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు .ఇక... ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలంటు సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను,.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సునీతా రెడ్డి. దీంతో.. సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తున్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com