ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్... ఒకరు మృతి

ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్... ఒకరు మృతి

ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఏప్రిల్ 30 మధ్య రాత్రి కస్తూర్బా గాంధీ మార్గ్, టాల్ స్టాయ్ మార్గ్ కూడలి వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారుతో ఢీకొట్టి ఒకరిని మూడుకిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. ముకుల్ (20), దీపాంశు వర్మ (30) బైక్ పై వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వీరి బైక్ ను ఢీకొట్టింది. ముకుల్ రోడ్డుపై పడిపోగా దీపాంశు కారు పైకప్పుపై పడిపోయాడు. అప్పటికే అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. దీపాంశు మృతదేహాన్ని అలాగే 3కిలోమీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. మహ్మద్ బిలాల్ అనే వ్యక్తి ( ప్రత్యక్ష సాక్షి ) తన స్కూటర్ పై వెంబడించి కారు పైకప్పుపై ఉన్న మృతదేహాన్ని, కారును వీడియో తీశాడు. హారన్ వేస్తూ, కేకలు వేస్తూ కారు డ్రైవర్ ను అప్రమత్తం చేయడానకి ప్రయత్నించినా కారు ఆగలేదు. దాదాపు 3కిలోమీటర్లు నాన్ స్టాప్ గా నడిపి మృతదేహాన్ని ఇండియాగేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ప్రమాదంలో దీపాంశు మృతిచెందగా, ముకుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, హర్నీత్ సింగ్ చావ్లా అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. అతనితో పాటు అతని కుటుంబం కూడా కారులో ఉన్నట్లు తెలిపారు. దీపాంశు వర్మ ఒక జ్యువెలరీ షాప్ నడుపుతూ ఉండేవాడు, అతనికి ఒక కొడుకు, తల్లిదండ్రులు, ఒక సోదరి ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story