UP : ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా మృతి

ఉత్తరప్రదేశ్ లో మరో గ్యాగ్ స్టర్ హతమయ్యాడు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన భయంకరమైన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా హతమయినట్లు పోలీసులు తెలిపారు. దుజానాపై హత్య, దోపిడీ వంటి 62 కేసులు ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, UP STF బృందానికి, అనిల్ దుజానా గ్యాంగ్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ కాల్చి చంపబడ్డాడు.
అనిల్ దుజానా పేరు భయానికి, ఉగ్రవాదినికి మారుపేరుగా గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానాలో చెప్పుకుంటారని స్థానికులు చెప్పారు. అతను పలు కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన అతను... 10 ఏప్రిల్ 2023 న విడుదలయ్యాడు. అతను జైలు నుంచి విడుదలైన వెంటనే, గౌతమ్ బుద్ నగర్‌లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్న వారిని బెదిరించాడు. సుందర్ భాటి చేతిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ నరేష్ భాటికి అనిల్ దుజానా సన్నిహితుడు. ఆ తర్వాత సుందర్ భాటిపై దుజానా దాడి చేశాడు. నరేష్ భాటి మరణం తరువాత, అనిల్ దుజానా అతని గ్యాంగ్ యొక్క కమాండ్‌ను నిర్వహించాడు. తాజాగా పోలీసుల చేతిలో హతమయ్యాడు దుజానా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com