డబ్బుల కోసం కుమార్తెను పడుపు వృత్తిలోకి..!

డబ్బుల కోసం కుమార్తెను పడుపు వృత్తిలోకి..!
X

విజయనగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక పట్ల ఆమె కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. డబ్బుల కోసం కుమార్తెను పడుపు వృత్తిలోకి నెట్టాలని చూసింది. బాలిక నిరాకరించడంతో చిత్ర హింసలకు గురి చేసింది. తల్లి పెడుతున్న టార్చర్‌ భరించలేని బాలిక ఛైల్డ్‌ లైన్ ప్రొటెక్షన్‌ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన అధికారులు.. బాలికను రక్షించారు. అనంతరం స్వధార్‌కు బాలికను తరలించారు. అయితే గతంలోనూ బాలిక లోకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఎలాంటి రక్షణ దొరకకపోవడంతో పాటు తల్లి టార్చర్ మరింత పెరగడంతో బాలిక 1098కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. బాలిక నవోదయ స్కూల్లో ప్లస్‌ వన్‌ చదువుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story