నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్‌

నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్‌

వరంగల్‌లో నకిలీ విత్తన తయారీదారుల ముఠాను అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలోని 15 మందిని అదుపులో తీసుకున్నారు. రెండు కోట్ల రూపాయలకుపైగా విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు వరంగల్‌ పోలీసులు. దీంతోపాటు 21 లక్షల రూపాయల నగదు, డీసీఎం, కారు, విత్తనాల తయారీ యంత్రాలను సీజ్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. రైతుల్ని మోసం చేసే నకిలీ ఎరువులు, విత్తనాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌. సీఎం ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story