భగత్‌సింగ్‌లా నటించబోయి.. నిజంగానే ఉరేసుకున్నాడు..!

భారత స్వాతంత్ర్య దినోత్సవం చిన్నారులు చేస్తున్న ఓ నాటక ప్రదర్శనలో విషాదం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్‌సింగ్ పాత్రలో నటించేందుకు రిహార్సల్స్ చేస్తున్న ఓ పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ ఉరి బిగుసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కువర్‌గావ్ జిల్లాకు చెందిన భూరే సింగ్ కుమారుడు శివమ్ అనే పదేళ్ళ బాలుడు.. తన మిత్రులతో కలిసి భగత్ సింగ్‌ను ఉరితీసిన సన్నివేశాన్ని రిహార్సల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉరితాడును అతడి మెడకు వేసుకోగా, ఆ సమయంలో కాళ్ల కింద ఉన్న పీట జారిపోయి పక్కకు పడిపోయింది. దీనితో ఆ ఉరితాడు బాలుడి మెడకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాలుడి తల్లిదండ్రులు అతడికి వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com