పదవతరగతి విద్యార్థి.. 15 హైపర్‌టెన్షన్ మాత్రలు తీసుకుని..

పదవతరగతి విద్యార్థి.. 15 హైపర్‌టెన్షన్ మాత్రలు తీసుకుని..
ఏ చిన్న కారణం ఉన్నా చనిపోవడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు.

ఏ చిన్న కారణం ఉన్నా చనిపోవడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు. కోల్‌కతాకు చెందిన 15 ఏళ్ల బాలుడు రక్తపోటును నియంత్రించే 15 మాత్రలు సేవించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కువ మోతాదులో మాత్రలు తీసుకోవడం వల్ల శరీరం విషపూరితమైనదని ఆసుపత్రి పేర్కొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మరణించాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బాగా చదువుతాడని, అతడిపై ఎలాంటి వత్తిడి లేదని పోలీసుల విచారణలో తల్లిదండ్రులు తెలిపారు. కానీ చికిత్స అందించిన వైద్యుడు మాత్రం డ్రగ్ ఓవర్ డోస్ గురించి తల్లిదండ్రులకు తెలియజేసి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో అడ్మిట్ చేయమని సూచించాడు. కానీ వైద్యుని మాట వినకుండా చికిత్స తీసుకుని ఇంటికీ వెళ్లిపోయారు. వైద్యుడు సూచించినప్పటికీ అతడిని ఆస్పత్రిలో చేర్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story