Uttar Pradesh: అత్యాచార బాలిక ఆర్తనాదాలు.. ఫోటోలు, వీడియోలు తీస్తూ..

Uttar Pradesh: అత్యాచార బాలిక ఆర్తనాదాలు.. ఫోటోలు, వీడియోలు తీస్తూ..
Uttar Pradesh: మానవత్వం మంటగలసిన వేళ.. మనిషి తాను చేస్తున్న పని ఏంటో కొంచెం కూడా విచక్షణ లేకుండా బతుకుతున్నాడు.

Uttar Pradesh: మానవత్వం మంటగలసిన వేళ.. మనిషి తాను చేస్తున్న పని ఏంటో కొంచెం కూడా విచక్షణ లేకుండా బతుకుతున్నాడు. ఓ పక్క బాలిక రక్తంతో తడిచి, సాయం కోసం గొంతు చించుకుని అరుస్తున్నా వినిపించుకోకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. పోలీసులకు సమాచారం అంది వాళ్లు వచ్చే వరకు పాపం బాలిక పడుతున్న వేదన వర్ణనాతీతం.

రక్తంతో తడిసిన 12 ఏళ్ల బాలిక సహాయం కోసం వేడుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత సేపు వీడియోలు తీసి వైరల్ చేయడం, లైకులు, సబ్‌స్ర్కైబ్‌లు వస్తే చాలనుకుంటున్నారు.


అంతే కానీ మానవత్వంతో సాయం చేయాలన్న ఆలోచన ఇసుమంతైనా కనిపించట్లేదు ఏ ఒక్కరిలో. ఒకవేళ కల్పించుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని ఆలోచించే వారు మరికొందరు. రోదిస్తున్న బాలిక చుట్టూ నిలబడి ప్రేక్షకుల్లా చూసేవారు కొందరైతే, ఆమెను మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరిస్తూ బిజీగా ఉన్నవారు మరికొందరు.


మైనర్‌పై అత్యాచారం చేసి, ఆపై ఇక్కడి డక్ బంగ్లా అతిథి గృహం వెనుక పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె తలపై కూడా పలు గాయాలయ్యాయి. పోలీసులు వచ్చే వరకు ఆమె సహాయం కోసం వేచి ఉండాల్సి వచ్చిందని నివేదికలు పేర్కొన్నాయి.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి గాయపడిన అమ్మాయిని తన చేతుల్లో తీసుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

బాలికపై సామూహిక అత్యాచారం చేసి పడేశారని స్థానికులు ఆరోపించగా, పోలీసులు వారి వాదనలను కొట్టిపారేస్తున్నారు. బాలిక స్టేట్‌మెంట్ కోసం పోలీసులు వేచి ఉన్నారు.

బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం పిగ్గీ బ్యాంకు కొనేందుకు బాలిక బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం గాలిస్తున్నారు. గెస్ట్ హౌస్ వెనుక బాలిక రక్తంతో తడిసిపోయి గాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story