13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. సెల్ ఫోన్‌లో రికార్డుచేసి..

13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. సెల్ ఫోన్‌లో రికార్డుచేసి..

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని సెల్ ఫోన్‌లో రికార్డుచేసి.. ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన బాలిక కుటుంబం.. కొంతకాలంగా శంషాబాద్‌ లోని సిద్దేశ్వర కాలనీలో నివాసముంటుంది. అదే కాలనీలో ఉంటున్న ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన గోపి.. బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానిక పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గోపిని అరెస్టు చేసి నిర్బయచట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story