Crime: స్వర్ణకారుడి బంగారంతో ఉడాయించిన దొంగలు

Crime: స్వర్ణకారుడి బంగారంతో ఉడాయించిన దొంగలు
X

ఓ స్వర్ణకారుడి వద్దనున్న 15 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ లోని పాత బస్టాండ్ దగ్గర జరిగింది. సురేష్ అనే స్వర్ణకారుడు డెలివరీకి ఇవ్వాల్సిన బంగారు నగలను బైక్ లో పెట్టుకుని వెళ్తున్నాడు. దాహంగా ఉండటంతో.. పాత బస్టాండ్ దగ్గర బైక్ ఆపి కొబ్బరినీళ్లు తాగేందుకు వెళ్లాడు, వచ్చి చూడగా బైక్ లో ఉన్న 15 తులాల బంగారం, త్రీ లక్షల నగదు మాయం అయినట్లు గ్రహించాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Tags

Next Story