పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చిన్నారి మృతి

పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే  చిన్నారి మృతి
పోలియో చుక్కలు వేయించుకున్న కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పురపాలిక పరిధిలోని నిన్న చోటు చేసుకుంది.

పోలియో చుక్కలు వేయించుకున్న కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పురపాలిక పరిధిలోని నిన్న చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీల దంపతులకు 16 నెలల దీక్షిత అనే కుమార్తె ఉంది.

అయితే నిన్న పోలియో చుక్కలు వేసే రోజు కావడంతో ఉదయం 11.45 గంటలకు శంభీపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేయించారు. ఆ తర్వాత 11.55కి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీనితో చిన్నారిని వెంటనే మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు.

అయితే చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమని చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లుగా దుండిగల్‌ సీఐ వెంకటేశం తెలిపారు. అయితే దీనిపైన జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. పోలియో చుక్కలు వికటించే అవకాశం లేదని అన్నారు. చిన్నారికి మృతికి ఇతర కారణాలు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story