Delhi Crime: 16ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపిన ప్రియుడు

Delhi Crime: 16ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపిన ప్రియుడు
X
పొడిచిన తర్వాత ఆమె రక్తపు మడుగులో ఉండగా.. ఆమెపై రాయితో దాడి చేశాడు. అదీ చాలదనక ఆమెను కాలితో తన్నాడు. దాదాపు 20 సార్లు కంటే ఎక్కువగా పొడిచినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలింది

ఓ ప్రియుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదివారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని సాహిల్ గా గుర్తించారు. ఈ ఘటన ఢిల్లీలోని షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు సాక్షి(16)గా గుర్తించారు పోలీసులు. సాక్షి ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్తుండగా దారి మధ్యలో ఆమె ప్రియుడు సాహిల్ అడ్డగించి దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. పొడిచిన తర్వాత ఆమె రక్తపు మడుగులో ఉండగా.. ఆమెపై రాయితో దాడి చేశాడు. అదీ చాలదనక ఆమెను కాలితో తన్నాడు. దాదాపు 20 సార్లు కంటే ఎక్కువగా పొడిచినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలింది.

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజా బాంథియా మాట్లాడుతూ: "అమ్మాయి ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఆమె శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. 20 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడచబడింది. నిందితుడు (సాహిల్) వయస్సు 20 సంవత్సరాలు. (అతన్ని) అరెస్టు చేయడానికి ఆరు బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి... అతని తల్లిదండ్రులు సహకరిస్తున్నారు (అతను) త్వరలో అరెస్టు చేయబడతారు" అని బాంథియా ఉటంకించారు. కొద్ది సేపటికే సాహిల్ అరెస్ట్ కాబడ్డాడు.


ఈ భయంకరమైన దాడి సీసీటీవీలో రికార్డైంది. యువతిని గోడకు ఆనించి, ఆమె ప్రియుడు సాహిల్ చాలాసార్లు సాక్షిని కత్తితో పొడిచినట్లు వీడియోలో రికార్డ్ అయింది. యువతిపై దాడి జరుగుతున్నప్పుడు స్థానికులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదు. విచక్షణారహితంగా పొడిచి, బండతో మోది, తన్నిన తర్వాత సాహిల్ అక్కడినుంచి వెళ్లిపోతాడు. వీరిద్దరు శనివారం గొడవ పడ్డట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హత్యపై మండిపడ్డారు. "ఢిల్లీలో ఓ మైనర్ బాలిక బహిరంగంగా హత్యకు గురైంది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. నేరస్థులు నిర్భయంగా హత్య చేశారు, పోలీసులంటే భయం లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ గారూ, శాంతిభద్రతలు మీ బాధ్యత, భద్రత కోసం ఏదైనా చేయండి. ఢిల్లీ ప్రజలే ప్రధానం...’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Tags

Next Story