Khammam : డిఆర్ఎఫ్ సిబ్బంది మృతి.. అధికారుల బలవంతం వల్లే నీళ్లల్లోకి దూకాడంటున్న కుటుంబసభ్యులు..

Khammam : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి వద్ద గల్లంతైన ఇద్దరు DRF సిబ్బందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్ అనే వ్యక్తి సుర్దేపల్లి వద్ద ఉన్న పాలేరు వాగులోకి చేపల వేటకోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు రంజిత్ చెక్‌డ్యాంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న కార్పొరేషన్‌లో పనిచేస్తున్న నలుగురు డీఆర్‌ఎఫ్ బృందం అక్కడికి వచ్చింది. సుర్దేపల్లి వాగు వద్దకు చేరుకున్న వారిలో బాశెట్టి ప్రవీణ్, పడిగెల వెంకటేష్ కూడా వాగులో కొట్టుకుపోయారు. వీరిలో వెంకటేష్ మృతదేహం లభ్యమైంది.
ఈ ఘటనతో గ్రామస్థులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. మరోవైపు ప్రవీణ్ కుటుంబసభ్యులు మాత్రం ఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో తన కుమారుడు కేవలం చెట్లు నరకడం, ఫ్లెక్సీలు తొలగించడం కార్పొరేషన్ పరిధిలో ఇతర పనులు చేయాల్సి ఉండగా.. అధికారులు బలవంతంగా నీళ్లలోకి పంపిచారని కుటుంబసభ్యులు ఆరోపించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com