తెలంగాణలో కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు.. తెలంగాణలో కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు.. తెలంగాణలో కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2,159 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అలాగే బుధవారం ఒక్కరోజే కరోనాతో 9 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలో 1005కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 318 నిర్ధారణ కాగా, తర్వాత రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేటలో 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 121, కరీంనగర్‌ 127, వరంగల్‌ అర్బన్‌లో 98 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అలాగే గత 24 గంటల్లో 2,108 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారు 1,33,555 గా ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story