Crime News: పెళ్లికి నో చెప్పడంతో అవమానంగా భావించిన అబ్బాయి..

Crime News: అమ్మాయికైనా, అబ్బాయికైనా జీవితంలో పెళ్లి ఓ ముఖ్యఘట్టం. ఇద్దరికీ మనస్ఫూర్తిగా నచ్చితేనే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలి. అదే విషయాన్ని ఆమె చెప్పింది అతడిని చేసుకోనని.. దాంతో అతడు మనస్థాపం చెందాడు.. అవమానంగా భావించాడు.. ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం మందపురానికి చెందిన గుండా తిరుపతిరెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తిరుపతి రెడ్డి సింగరేణి ఉద్యోగి. పెద్ద కుమారుడు ఉద్యోగ రిత్యా చెన్నూర్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు వినోద్ రెడ్డి హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు.
వినోద్‌కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు.. ఈ క్రమంలో ఓ యువతితో సంబంధం ఖాయమనుకుంటున్న తరుణంలో ఆమె వినోద్‌ని రిజెక్ట్ చేసింది. దీంతో అతడు మనస్థాపానికి గురయ్యాడు. శనివారం హైద్రాబాద్ నుంచి తల్లిదండ్రులు ఉంటున్న భూపాల పల్లికి వెళ్లాడు వినోద్. పరకాలలో స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నానని అమ్మానాన్నాలకు చెప్పి కారులో బయల్దేరాడు..
అంతలోనే కాళేశ్వరం కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసుల విచారణలో యువతి పెళ్లికి నిరాకరించడంతో వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం వినోద్ మృతదేహాన్ని జాలర్లు వెలికితీశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com