Suryapet: యువకుడిపై కత్తులతో దాడి, నలుగురి అరెస్ట్

Suryapet: యువకుడిపై కత్తులతో దాడి, నలుగురి అరెస్ట్
అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి, స్థానికుల చొరవతో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు
నలుగురు వ్యక్తులు ఓ యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో సూర్యాపేట పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వి.కృష్ణ, మణిదీప్, పి.మహేశ్, ప్రేమ్ నాయుడుగా గుర్తించారు. పాత కక్షలతోనే యువకుడిపై దాడిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సీసీటీవీో రికార్డ్ అవ్వడంతో వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story