Rajanna Siricilla : పోలీస్ స్టేషన్‌లో మూడేళ్ల బాలుడి ఫిర్యాదు..

Rajanna Siricilla : మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు సార్ అంటూ మూడో తరగతి బాలుడు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జంగ దీపిక, బాలకిషన్ దంపతులకు కుమారుడు భరత్, కుమార్తె శివాని ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తండ్రి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో తల్లిని కొట్టడం, తిట్టడం చేస్తుండడాన్ని పలుమార్లు బాలుడు గమనించాడు. రోజులాగే తాగి వచ్చిన తండ్రిని చూసి దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. ఎస్సైకు ఫిర్యాదు చేశాడు. న్యాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చానన్న బాలుడి ధైర్యాన్ని చూసి పోలీసులు అభినందించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ చేశారు. మళ్లీ ఇలా చేయొద్దని తండ్రిని హెచ్చరించి పంపించేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com