Kakinada : రూ.20 కోట్ల భూమి కబ్జా.. అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించిన బకాసురులు..

Kakinada : రూ.20 కోట్ల భూమి కబ్జా.. అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించిన బకాసురులు..
Kakinada : కాకినాడ జిల్లా వాకలపూడిలో భూబకాసురులు దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు

Kakinada : కాకినాడ జిల్లా వాకలపూడిలో భూబకాసురులు దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 20కోట్ల రూపాయాల విలువైన 4ఎకరాల భూమిని కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ భూముల్లో అడుగుపెడితే దాడులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారని బాధితులు అంటున్నారు. కడప జిల్లాకు చెందిన వర్ధిరెడ్డి సుబ్బారెడ్డి అనుచరుల మంటూ బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఈవిషయంపై పోలీసులు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 35 ఏళ్ల నుంచి ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని అన్ని పత్రాలు ఉన్నాయని బాధితులు అంటున్నారు.

కాకినాడ రూరల్ వాకలపూడి పంచాయతీలో సర్వే నెంబర్ 192/2లో 4 ఎకరాలు 86 సెంట్ల భూమి ఉంది. 1985లోనే లే అవుట్లు వేశామని భూయజమానులు చెబుతున్నారు. అప్పట్లో సుమారు 50 మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. కొంతమంది ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. కాని ఇప్పుడు కడప జిల్లాకు చెందిన వర్ధిరెడ్డి సుబ్బారెడ్డి అనుచరులు ఎంటరై తమను బెదిరిస్తున్నట్లు బాధిత యజమానులు ఆరోపిస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాంట్లను కొనుగోలు చేశామని ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఎమ్మార్వో ఆఫీసు ముందు ధర్నా చేపట్టినా అధికారులు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story