ఉత్తరప్రదేశ్‌లో పాశవికం : 50 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్తపై మానవమృగాల పంజా

ఉత్తరప్రదేశ్‌లో పాశవికం : 50 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్తపై మానవమృగాల పంజా
ఈ నెల 3వ తేదీన సాయంత్రం ఆ అంగన్వాడీ కార్యకర్త దైవ దర్శనం కోసం స్థానిక ఆలయానికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు.

ఉరిశిక్షలు పడుతున్నా కామాంధుల్లో భయం లేదు. నిర్భయ తరహా ఘటన యూపీలోనూ వెలుగు చూడడం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో మానవ మృగాలు 50 ఏళ్ల మహిళను బలితీసుకున్నాయి. దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ అంగన్వాడీ కార్యకర్తపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత కాళ్లు విరగొట్టి, పక్కటెముకలు విరిచి, ప్రైవేట్ పార్ట్స్‌ను ఛిద్రం చేసి, ఊపిరితిత్తుల్లో రాడ్డుతో పొడిచి అత్యంత భయానకంగా ఆమె ప్రాణం తీశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన రాక్షసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

ఈ నెల 3వ తేదీన సాయంత్రం ఆ అంగన్వాడీ కార్యకర్త దైవ దర్శనం కోసం స్థానిక ఆలయానికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు. అయితే అర్ధరాత్రి వేళ ఆలయ పూజారి, మరో ఇద్దరితో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. బావిలో పడిపోయిందని, ఆమె అరుపులు విని రక్షించి తీసుకొచ్చామని చెప్పి వాళ్లు వెళ్లిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటికీ తీవ్ర రక్తస్రావమైన ఆ మహిళను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ మహిళ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహిస్తే షాకింగ్ విషయాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసులు... ఆ తర్వాత అత్యంత దారుణంగా గాయపర్చారని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. రంగంలోకి దిగిన పోలీసులు పూజారితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు అసలు సూత్రదారుల కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story