కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ఐదుగురి మృతి

కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ఐదుగురి మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధ వారం తెల్లవారుజామున దాచేపల్లి మండలం పొందుగల దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధ వారం తెల్లవారుజామున దాచేపల్లి మండలం పొందుగల దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురుజాల ఆస్పత్రికి తరలించారు. తెలంగాణకు చెందిన 23 మంది కూలీలు ఆటోలో వెళుతుండగా.. లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులు, మృతులంతా నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story