7 కోట్ల రూపాయలతో ఉడాయించిన దొంగలు

7 కోట్ల రూపాయలతో ఉడాయించిన దొంగలు
పంజాబ్‌ లుథియానాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రాజ్‌గురులోని ఓ కార్యాలయంలో పడి 7 కోట్ల రూపాయలు లూఠీ చేశారు.

పంజాబ్‌ లుథియానాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రాజ్‌గురులోని ఓ కార్యాలయంలో పడి 7 కోట్ల రూపాయలు లూఠీ చేశారు. జూన్ 10వ తేదీ అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు జరిగిన ఈ సంఘటన పెను సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్యాలయంలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఒక మహిళతో సహా 8 నుంచి 10 మంది నిందితులు కలిసి దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story