చదివింది ఎనిమిది.. యూట్యూబ్ చూసి బ్యాంకు దోపిడీ

చదివింది ఎనిమిది.. యూట్యూబ్ చూసి బ్యాంకు దోపిడీ
యూట్యూబ్ వీడియో చూసి 8వ తరగతి పాస్ అయిన అబ్బాయి బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసి పట్టుబడ్డాడు.

యూట్యూబ్ వీడియో చూసి 8వ తరగతి పాస్ అయిన అబ్బాయి బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసి పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 8వ తరగతి పాసైన ఓ యువకుడు యూట్యూబ్ వీడియో చూసి బ్యాంకును దోచుకోవాలని ప్లాన్ చేశాడు. తలుపులు పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించగలిగాడు. కానీ అలారం మోగడంతో దొరికిపోయాడు. అతడి నుంచి అత్యాధునిక జామర్‌తో సహా పలు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సినిమా స్టైల్‌లో స్టేట్ బ్యాంక్‌లో దోపిడీకి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్‌లో వీడియో చూసిన నిందితుడు బ్యాంక్‌లో దోపిడీకి ప్లాన్ చేసి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బ్యాంక్ తలుపులు కూడా పగులగొట్టారు.

ఎనిమిదో తరగతి పాసైన ఈ యువకుడి పేరు సమీర్ అన్సారీ. అతడి దోపిడీ ప్లాన్ విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అరెస్టయిన యువకుడు యూట్యూబ్ వీడియో చూసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. నిందితుడు పురూలియా హుడా పోలీస్ స్టేషన్‌లోని దుమ్ముదుమి గ్రామానికి చెందినవాడు.

నిందితుడు డ్రిల్‌ మిషన్‌, జామర్‌ తదితర అత్యాధునిక పరికరాలను ఉపయోగించాడని పోలీసు అధికారి తెలిపారు. దోపిడీకి ప్రయత్నించిన వారిలో అతనితో పాటు మరెవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ తలుపును కూడా బయట నుండి లాక్ చేసినట్లు చెప్పారు. అతను తన ముఖాన్ని మాస్క్‌తో కప్పుకున్నాడు.

బ్యాంకు ఎమర్జెన్సీ అలారం మోగిన వెంటనే అగంతకుడు పారిపోయాడు. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఓ బ్యాగ్, అత్యాధునిక వాల్ట్ కట్టర్, వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story