Maharastra: షాకింగ్.. ఆ ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. ఆత్మహత్యగా అనుమానాలు..

Maharastra: షాకింగ్.. ఆ ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. ఆత్మహత్యగా అనుమానాలు..
Maharastra: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లో శవమై కనిపించారు.

Maharastra: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లో శవమై కనిపించారు.వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌లోని ఓ ఇంట్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

"మేము ఒక ఇంట్లో తొమ్మిది మృతదేహాలను కనుగొన్నాము. మూడు మృతదేహాలు ఒక చోట, ఆరు మృతదేహాలు ఇంట్లోని వేర్వేరు ప్రదేశాలలో లభ్యమయ్యాయి" అని సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడమ్ చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని తనిఖీ చేస్తున్నారు. మరణానికి గల కారణాలను ధృవీకరిస్తున్నారు.

ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు మరో పోలీసు అధికారి తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం మాత్రమే మృతికి కచ్చితమైన కారణం తెలియనుంది. మృతి చెందిన కుటుంబసభ్యులు అందరూ పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags

Next Story