Bridge Theft: అధికారులమని చెప్పి బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయారు.. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..!

Bridge Theft : ఇరిగేషన్ అధికారులమని చెప్పి ఏకంగా 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని మాయం చేశారు కొందరు దొంగలు.. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా అమియావార్‌లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమియావార్‌లో ఓ పురాతనమైన ఐరన్ బ్రిడ్జి ఉంది. దీనిని 1972 సంవత్సరంలో నిర్మించారు.. ఇది 500 టన్నుల బరువుంటుంది.
ఐతే ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలు కూడా ఆగిపోయాయి.. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు గతంలో అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపైన దొంగల కన్ను పడింది.. దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వారుఅనుకున్నారు.. అందుకు గాను ఓ పక్కా పథకాన్ని పన్నారు.. నీటిపారుదల శాఖకు చెందిన అధికారులమని చెప్పి జేసీబీ, గ్యాస్ కట్టర్లు మరియు మరికొన్ని పరికరాలను ఉపయోగించి వంతెనను ముక్కలు చేసి అక్కడినుంచి పరారయ్యారు.
ఇంకో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీటిపారుదల శాఖ అధికారులమని చెప్పేసరికి కొందరు గ్రామస్తులు, అక్కడి స్థానిక అధికారులు కూడా వారికి సహాయం అందించారు. అలా దాదాపుగా మూడు రోజుల పాట దొంగలు ఈ పనికి పూనుకొని ఆ తర్వాత అక్కడినుంచి ఊడాయించారు.
ఈ ఘటన పైన గురువారం (ఏప్రిల్ 7) నస్రీగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న ఐరన్ ని దొంగలు మాయం చేసినట్టుగా అధికారులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com