Nizamabad: నిజామాబాద్ జిల్లా గ్రామీణ బ్యాంకులో చోరీ.. భారీగా నగదు, పెద్దమొత్తంలో నగలు..
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. గత రాత్రి బ్యాంకులోకి ప్రవేశించి నగదు, నగలు ఊడ్చేశారు.

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. గత రాత్రి బ్యాంకులోకి ప్రవేశించి నగదు, నగలు ఊడ్చేశారు. మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ చోరీ ఘటన జరిగింది. ముందుగా BSNLఆఫీసులోకి ప్రవేశించిన దొంగలు.. అందులో నుండి బ్యాంక్‌పైకి ఎక్కి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గ్యాస్‌కట్టర్‌తో షెట్టర్ తాళాలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంక్ లోని లాకర్లను కూడా గ్యాస్‌కట్టర్‌తో ఓపెన్ చేశారు.
ఈ క్రమంలో లాకర్‌లోని కొంత డబ్బు, పత్రాలు బూడిదయ్యాయి. పెద్దమొత్తంలో డబ్బు, నగలను దొంగలు ఊడ్చేశారు. ఈ రోజు బ్యాంక్ తెరవగానే దొంగతనం వెలుగుచూసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీపీ నాగరాజు బ్యాంకును సందర్శించారు. ఏడు లక్షల నగదు, రెండు కోట్లకు పైగా విలువగల నగలు ఎత్తుకెళ్లినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.
RELATED STORIES
Gorantla Nude Video : హీటెక్కుతున్న గోరంట్ల న్యూడ్ వీడియో వివాదం..
13 Aug 2022 3:00 AM GMTVishakapatnam : విశాఖ తీరంలో మరో ప్రేమజంట ఆత్మహత్య..
12 Aug 2022 11:46 AM GMTEamcet Ecet Results : తెలంగాణ ఎంసెట్ ఈసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 9:23 AM GMTNCW On Gorantla : గోరంట్ల వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
11 Aug 2022 4:30 PM GMTSupreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
11 Aug 2022 9:15 AM GMTAP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా చెత్త పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం...
11 Aug 2022 6:15 AM GMT