Crime News: మొబైల్ గేమ్స్‌కు బానిసైన బాలుడు.. తండ్రి ఫోన్ రిపేర్ చేయించట్లేదని..

Crime News: మొబైల్ ఫోన్‌ను బాగు చేయించడానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో గేమ్‌కు బానిసైన మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ గ్రేటర్ నోయిడాలోని తన నివాసంలో పైకప్పుకు ఉరివేసుకుని కనిపించాడు. అతడికి మొబైల్‌లో ఆటలు ఆడడం అంటే ఇష్టం. ఎంత చెప్పినా వినట్లేదు.. ఈ క్రమంలో ఫోన్ రిపేర్‌కి వచ్చింది. దాన్ని బాగు చేయిస్తే మళ్లీ ఎక్కడ గేమ్‌లు ఆడుతాడో అని అతని తండ్రి ఫోన్‌ను రిపేర్ చేయించడానికి ఇష్ట పడలేదు. దానికి కుటుంబసభ్యులు కూడా మద్దతు పలికారు. చదువు లేదు సంధ్య లేదు.. అస్తమాను ఆటలంటూ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నాడు అని ఇంట్లో అందరూ అతడి మీద విరుచుకు పడ్డారు.
ఫోన్‌ను బాగు చేయించడానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో బాలుడు కలత చెందాడు. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని తన నివాసంలో పైకప్పుకు ఉరివేసుకుని కనిపించాడు. మైనర్ తన జీవితాన్ని ముగించడానికి వెనుక ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, బాలుడు మొబైల్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నాడని, అతని ఫోన్ పాడైందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మైనర్‌కు ఆటలు ఆడడం అంటే ఇష్టం, అతని తండ్రి అతని ఫోన్‌ను రిపేర్ చేయించడానికి సిద్ధంగా లేడు, ఎందుకంటే అతను మళ్లీ గేమ్స్ ఆడతాడు అని చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని" అని డిసిపి సాద్ మియాన్ ఖాన్ చెప్పారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com