Bus Driver : ఫుల్లుగా తాగి బస్సు నడిపాడు... ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్ ..!

Bus Driver : విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన ఓ డ్రైవర్ నిబంధనల్ని గాలికి వదిలేశాడు. ఫుల్లుగా మందేసి బస్ స్టీరింగ్ పట్టాడు. లక్కీగా ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం రావడంతో దారి కాసి అతనికి పరీక్షలు చేసి జైలుకు పంపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సమీపంలో జరిగింది ఈ ఘటన.
హైదరాబాద్-2 డిపోకు చెందిన పల్లెవెలుగు అద్దె బస్సు డ్రైవర్ రాములు నిన్న ఉదయం పదిన్నరకు దిల్‌షుఖ్‌నగర్ నుంచి తొర్రూరుకు బయలుదేరాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు బస్టాండ్ కు చేరుకుంది. భోజనం టైమ్‌లో బస్టాప్ సమీపంలో ఉన్న బెల్ట్ షాపులో డ్రైవర్ మద్యం తాగాడు.
తర్వాత బస్సు స్టార్ట్ చేసి తిరుమలగిరి వైపు వెళుతుండగా ఓ వ్యక్తి డ్రైవర్ మద్యం తాగిన విషయం గమనించి పోలీసులకు చెప్పాడు. వెంటనే తిరుమలగిరి ASI జగన్మోహన్‌రెడ్డి సిబ్బందితో కలిసి దారిలో బస్‌ను ఆపారు. ఐతే.. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయబోగా రాములు అందుకు ఒప్పుకోలేదు. వాగ్వాదానికి దిగాడు. కండక్టర్‌తోపాటు ప్రయాణికులను ఆరా తీయగా ఎవరికీ డ్రైవర్ మద్యం తాగినట్లు తెలియదనే చెప్పారు.
చివరికి టెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com