Nalgonda : బస్సులో దోపిడీ.. దొంగ ఎవరో తెలుసా?

Nalgonda :  బస్సులో దోపిడీ.. దొంగ ఎవరో తెలుసా?
Nalgonda : ఈ వలస కూలీలంతా బిహార్, అసోం రాష్ట్రానికి చెందిన వాళ్లు. ఇన్నాళ్లు కేరళలో పనులు చేసిన వీళ్లంతా.... ఓ ప్రైవేట్ బస్సులో పండక్కు సొంతూళ్లకు బయలు దేరారు.

Nalgonda : నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వలస కూలీలకు అండగా నిలిచారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. స్థానిక ఎస్సైతో మాట్లాడి వారికి రాత్రి బస ఏర్పాటు చేశారు. కూలీలు బస చేసిన ఫంక్షన్ హాలుకు వెళ్లి వారిని పరామర్శించారు. కూలీలకు టిఫిన్ పెట్టించిన ఎమ్మెల్యే.. మధ్యాహ్నం లంచ్ కు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దిగులు పడాల్సిన అవసరం లేదని మిమ్మల్ని సొంతూళ్లకు చేర్పించే బాధ్యత అని వలస కూలీలకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

ఈ వలస కూలీలంతా బిహార్, అసోం రాష్ట్రానికి చెందిన వాళ్లు. ఇన్నాళ్లు కేరళలో పనులు చేసిన వీళ్లంతా.... ఓ ప్రైవేట్ బస్సులో పండక్కు సొంతూళ్లకు బయలు దేరారు. పాపం ఎంతో ఆనందంతో బయల్దేరిన కూలీలకు షాకిచ్చాడు బస్సు డ్రైవర్. నార్కట్‌ పల్లి వద్ద కూలీలు టిఫిన్ కు దిగిన టైంలో... లాగేజీతో సహా అక్కడి నుంచి జంప్ అయ్యాడు.

కాయాకష్టం చేసిన సొమ్మంతా బస్సులోనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వలస కూలీలు. ఒక్కో టికెట్‌ 3 వేల 500 పెట్టి కొంటే.. మధ్యలోనే వదిలి వెళ్లిపోయారని వాపోయారు. డ్రైవర్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నార్కట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితులను హైదరాబాద్‌ కు పంపే ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story