భార్య పిల్లలు ఉంటుండగానే మరో పెళ్లి... శ్రీకాకుళం జిల్లాలో..!

భార్య పిల్లలు ఉంటుండగానే మరో పెళ్లి...  శ్రీకాకుళం జిల్లాలో..!
రక్షణ ఇవ్వాల్సిన పోలీసే.. కట్టుకున్న భార్యకు అన్యాయం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

రక్షణ ఇవ్వాల్సిన పోలీసే.. కట్టుకున్న భార్యకు అన్యాయం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. కాశీబుగ్గలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ భార్య, ముగ్గురు పిల్లలను వదిలి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. కానిస్టేబుల్‌ కావడంతో తనకు పోలీసులు న్యాయం చేయట్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయకపోతే చావే శరణ్యమంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story