Hyderabad: సోషల్ మీడియా పరిచయం.. ఆపై ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు ఆత్మహత్య..

Hyderabad: సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారింది.. ఇద్దరి మధ్యా ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది.. అయితే, పెద్దవాళ్ల పరువు ఆరాటంలో వీరిద్దరి ప్రేమ కథ విషాదాంతమైంది.. హైదరాబాద్ నేరేడ్‌మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. కాకతీయ నగర్‌కు చెందిన శ్రీకాంత్‌కు రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఉంటున్న నిఖితతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారగా.. ఈ ఏడాది జూన్ 4న వివాహం చేసుకున్నారు.
అయితే, మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేని నిఖిత తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. శ్రీకాంత్ వివరాలు సేకరించిన పోలీసులు అతను మైనర్ అని తేలడంతో అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో మనస్తాపం చెందిన నిఖిత ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది.. రెండ్రోజులకే శ్రీకాంత్ కూడా సూసైడ్ చేసుకున్నాడు.. వినాయకనగర్ రైల్వే గేట్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. నిఖిత తల్లిదండ్రులు పరువు కోసం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నారని శ్రీకాంత్ బంధువులు ఆవేదనతో చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com