Cyber Crime: బ్యాంక్ ఉద్యోగిని ఖాతాలోనే లూటీ.. సైబర్ నేరగాడి మాస్టర్ ప్లాన్..

Cyber crime (tv5news.in)

Cyber crime (tv5news.in)

Cyber Crime: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చదువుకోని వారు మాత్రమే కాదు.. చదువుకున్నవారు, హై ప్రొఫైల్ ఉద్యోగులు కూడా పడుతున్నారు

Cyber Crime: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చదువుకోని వారు మాత్రమే కాదు.. చదువుకున్నవారు, హై ప్రొఫైల్ ఉద్యోగులు కూడా పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ప్లే చేస్తున్న ట్రిక్స్ అలాంటివి మరి. ప్రజలు తెలివిగా వారి ట్రిక్స్‌ను తిప్పికొట్టాలని ప్రయత్నిస్తుంటే.. వారు కూడా అంతే చాకచక్యంతో మరింత ఎక్కువగా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక ఆర్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగినినే మోసం చేశాడు కేటుగాడు.

ముంబాయిలో నివసించే 70 ఏళ్ల రిటైర్డ్ ఆర్‌బీఐ బ్యాంక్ ఉద్యోగినికి ఒకరోజు తన కెవైసీ అప్‌గ్రేడ్ చేసుకోమని ఒక మెసేజ్ వచ్చింది. దీంతో ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి ఆ మెసేజ్‌లలో ఉన్న నెంబర్‌కు కాల్ చేసింది మహిళ. సీనియర్ సిటిజన్లు కేవైసీ అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం పలు సౌకర్యాలు అందిస్తున్నట్టు పేర్కొన్నాడు ఫేక్ బ్యాంక్ ఉద్యోగి రాహుల్.

మహిళ అతడి మాటలు నమ్మింది అని నిర్దారించుకున్న తర్వాత తనకు ఒక వెబ్ లింక్‌ను పంపించాడు. ఆ లింక్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ లోగో కనిపించగానే మహిళ నిజంగానే అది నమ్మదగిన ఖాతా అనుకునే తన బ్యాంక్ వివరాలను నింపింది. అంతే.. కాసేపటికే తన బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 3 లక్షలు సైబర్ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోయాయి.

డబ్బులు పోవడాన్ని గుర్తించిన మహిళ.. వెంటనే తన బ్యాంకుకు ఫోన్ చేసి తన కార్డ్‌ను బ్లాక్ చేయించింది. ఆ తర్వాత ఈ విషయం గురించి చితల్‌సర్ మాన్‌పాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story