Sangareddy: సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బాలిక ప్రాణం తీసిన ఎయిర్ గన్..

X
By - Divya Reddy |16 March 2022 12:45 PM IST
Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం వావిలాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం వావిలాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఫార్మ్ హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారి సాన్వి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన వివరాలను నిన్న ఉదయం నుంచి పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన చిన్నారి తండ్రి నాగరాజు... ఫామ్ హౌస్‌లో కూలి పని చేస్తుంటాడు. కోతులు, కొంగల బెడద ఉండటంతో... వాటిని తరిమేందుకు ఎయిర్ గన్‌ను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ కూడా హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ రావు అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com