Hyderabad : భార్యమీద కోపంతో కన్నకొడుకును చిత్రహింసలు పెట్టిన న్యాయవాది

Hyderabad : న్యాయాన్యాయాలు చెప్పాల్సిన ఓ న్యాయవాది... క్రూరంగా మారాడు. భార్యమీద కోపంతో అభం శుభం తెలియని పదేళ్ల కొడుకును చిత్రహింసలకు గురిచేశాడు. సరూర్ నగర్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ కుమార్ అనే న్యాయవాది కుటుంబ కలహాల కారణంగా గత 4 ఏళ్లుగా వేరుగా ఉంటున్నాడు.
నాలుగు నెలలక్రితం కోర్టు ఆర్డర్ ప్రకారం పదేళ్ల బాలుడిని తండ్రి సంతోష్ కుమార్‌కు అప్పగించారు. దీంతో భార్యమీద ఉన్న కోపంతో సంతోష్ కుమార్... కుమారుడిని చిత్రహింసలకు గురిచేశాడు. ఒంటిపై వాతలు పెడుతూ పైశాచిక ఆనందం పొందాడు. తండ్రిపెట్టే బాధలు భరించలేని బాలుడు తప్పించుకొని పారిపోయి తల్లి వద్దకు చేరుకున్నాడు.
బాలుడి ఒంటిపై గాయాలు చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయి... స్థానిక పోలీసులు ఫిర్యాదుచేసింది. నల్లకోటు అడ్డుపెట్టుకొని కట్టుకున్న తనను, కడుపులో పుట్టిన బిడ్డను చిత్రహింసలకు గురిచేస్తున్న సంతోష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com