ప్రేమికుల్ని బంధించారు.. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి.. !

ప్రేమికుల్ని బంధించారు.. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి.. !
తమపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆకతాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది.

తమపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆకతాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన.. భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితి, సోనపూర్‌(డీఎన్‌కే) గ్రామంలోని తన అక్క ఇంటికి ఈ నెల 8న వచ్చింది ఓ యువతి.. అక్కడ కాళీమాతకి పూజలు చేసిన అనంతరం అదే రోజు రాత్రి జరిగిన జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆ యువతి హాజరైంది.

అక్కడికి ఆమె ప్రియుడు కూడా వచ్చాడు. దీనితో ప్రియుడితో కాసేపు మాట్లాడేందుకు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం నుంచి కొంచెం దూరం వెళ్లింది.. అయితే అక్కడ వీరిని చూసిన కొందరు ఆకతాయులు వారిని బలవంతంగా బంధించి వారి వివరాలపై ఆరాతీశారు. దీనికి సంబంధించి ఓ వీడియో తీశారు. ఆ తర్వాత వారి ఇద్దరిపై పూలు చల్లి, పెళ్లి చేసినట్లుగా మరో వీడియో తీశారు.

అంతేకాకుండా యువతి శరీరం పైన చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఎంత మొరపెట్టుకున్నా వారు వినలేదు.. చివరికి ఆ మరుసటిరోజు ఉదయం వారిని విడిచిపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. తమని బంధించి చిత్రహింసలు పెట్టిన వీడియో వైరల్‌‌‌గా మారిందని.. దీనితో తమ పరవు పోయిందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రేమ జంట పోలీసులను కోరారు. లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.

Tags

Read MoreRead Less
Next Story