Mahbubnagar : భార్య కాపురానికి రావడంలేదని.. సెల్ టవర్ ఎక్కి తిరిగి దిగుతుండగా..!

Mahbubnagar : భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపంతో టవర్ ఎక్కిన ఓ వ్యక్తి తిరిగి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి చనిపోయాడు.. ఈ విషాదకరమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్లకి చెందిన కాగుల యాదయ్య(35), నాగర్‌కర్నూల్ జిల్లాకి చెందిన ఓ మహిళతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే మద్యానికి బానిసయ్యాడు యాదయ్య.. ఇది భరించలేక అతని భార్య కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీనితో బుధవారం మద్యం తాగిన మైకంలో యాదయ్య సెల్ టవర్ ఎక్కాడు. కాపురానికి రాకపోతే చనిపోతానని బెదిరించాడు. ఎంతమంది నచ్చజెప్పిన వినని యాదయ్య.. ఓ వ్యక్తి మద్యం బాటిల్‌ను చూపించడంతో సెల్ టవర్ దిగేందుకు సిద్దమయ్యాడు.
కానీ టవర్‌కు ఉన్న నిచ్చెన మీదుగా కాకుండా రాడ్‌ల మీదుగా దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మరణించారు.. సుమారుగా 30 అడుగుల ఎత్తుపై నుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com