భార్యను హత్య చేసి కరోనా అని నమ్మించాడు.. కానీ చివరికి..!

భార్యను హత్య చేసి కరోనా అని నమ్మించాడు.. కానీ చివరికి..!
కట్టుకున్న భార్యను చంపేసి కరోనాతో చనిపోయిందని చిత్రీకరించాడు ఓ భర్త.. వనస్థలీపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కట్టుకున్న భార్యను చంపేసి కరోనాతో చనిపోయిందని చిత్రీకరించాడు ఓ భర్త.. వనస్థలీపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలీపురానికి చెందిన విజయ్‌ కొద్దిరోజుల క్రితం తన భార్య కవితను హత్య చేశాడు. అయితే కవిత కరోనా కారణంగా చనిపోయిందని అందర్నీ నమ్మించాడు. పైగా అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. అయితే విజయ్ పైన అనుమానం ఉన్న కవిత తల్లిదండ్రులు... తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమొదు చేసుకున్న పోలీసులు కవిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో కవిత కరోనాతో మృతి చెందాలని తేలడంతో విజయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story