ప్రేమ పేరుతో యువతిని మోసగించి, నిర్బంధించిన యువకుడు.!

ప్రేమ పేరుతో యువతిని మోసగించి, నిర్బంధించిన యువకుడు.!
ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆ యువతిని రెండ్రోజుల పాటు నిర్బంధించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నపుడూరు గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రేమించిన వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన యువతిని నిర్బంధించాడో యువకుడు. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆ యువతిని రెండ్రోజుల పాటు నిర్బంధించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నపుడూరు గ్రామంలో చోటుచేసుకుంది. నపుడూరుకు చెందిన రమేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. అక్కడ యువతిని ప్రేమించాడు. లాక్‌డౌన్‌తో సొంత గ్రామానికి వచ్చిన రమేష్‌కు... తల్లిదండ్రులు మరో అమ్మాయితో వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న యువతి.. రమేష్‌ను నిలదీయడంతో రాజీ కుదుర్చేందుకు అతడి తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నించారు. అయినా యువతి పట్టువీడకపోవడంతో ఆమెను నిర్బంధించారు. స్థానికుల సమాచారంతో బందీగా ఉన్న యువతిని రక్షించిన పోలీసులు.. రమేష్‌తో పాటు అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story