Siricilla : పొలానికి వెళ్లిన మహిళపై యువకుడు అసభ్య ప్రవర్తన.. చితకబాదిన గ్రామస్తులు..!

X
By - /TV5 Digital Team |4 Nov 2021 11:00 AM IST
Siricilla : మహిళా రైతు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
Siricilla : మహిళా రైతు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. చందుర్తి మండలం కట్ట లింగంపేట శివారులో మహిళా రైతు పొలం వద్ద వడ్లు ఆరబెడుతుంది. ఆ సమయంలో ఓ యువకుడు వచ్చి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఆ యువకుడిని పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి దేహశుద్ధి చేశారు. అనంతరం చందుర్తి పోలీసులకు అప్పగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com