Hyderabad: జూబ్లీహిల్స్‌లో దారుణం.. భార్యను చంపి, ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టిన భర్త..

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి రెండు ముక్కలు చేసి ఇంట్లోని డ్రమ్ములో పెట్టాడో కిరాతక భర్త. ఈ ఘటన ఎస్పీఆర్‌హిల్స్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్‌లో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ తండాకు చెందిన అనిల్‌కుమార్, సరోజ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో సరోజను తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
కొన్ని రోజులకు భార్యను తిరిగి తీసుకొచ్చాడు అనిల్. ఈనెల 3న సరోజకు తల్లిదండ్రులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ఎస్పీఆర్‌హిల్స్ వచ్చారు. అల్లుడికి ఫోన్ చేస్తే బయట ఉన్నానని సమాధానం ఇచ్చాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ 4వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దీంతో పోలీసులు ఇంటికి వెళ్లి తలుపు తెరిచారు. దుర్వాసన రావడంతో ఇళ్లంతా వెతికారు. ఒక డ్రమ్ములో కుళ్లిపోయిన సరోజ మృతదేహం కనిపించింది. దీంతో తండ్రి భోరున విలపించాడు. అయితే.. 2020లో మొదటి భార్యను అనిల్ హత్య చేసినట్లు పోలీసులు అంటున్నారు. అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెను కూడా బలితీసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com